Wednesday, February 17, 2016

Vijayawada NEW APSRTC Busstand

Vijayawada NEW APSRTC Busstand











Sri NCBN lays foundation stone for Interim Government Complex

Sri NCBN lays foundation stone for Interim Government Complex
Sri NCBN today laid the foundation stone for an Interim Government Complex at Velagapudi village with a built-up area of six lakh sq ft spanning a 28-acre area. The Complex will be built by construction majors L&T and Shapoorji Pallonji. Another 17 acres in Velagapudi village has been earmarked for creating public facilities around the temporary secretariat.



















Monday, February 1, 2016

కాపులను టార్గెట్ చేసిన వైయస్ జగన్?

ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుల రాజకీయం ‘ఆహుతి’గా మార్చివేసింది. ఈ సమయంలో నేతలు కాస్త సంయమనం పాటిస్తూ ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆరిన కార్చిచ్చు ఏ సమయంలోనైనా మళ్ళీ రాజుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఈ విషయాలు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కు తెలియవా? అంటే ‘ఆ ఒక్కటీ అడక్కు…’ అని చెప్పాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

ఓ పక్కన కులం పేరుతో కొట్లాటలు జరుగుతుంటే ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా దానిని నియత్రించాల్సిన విధంగా వ్యాఖ్యానించాల్సిన జగన్, అలా కాకుండా అగ్నికి మరింత ఆజ్యం పోసే విధంగా మాట్లాడారని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ ఉదంతానికి సంబంధం లేని, కాపులకు ప్రధాన నాయకుడైన వంగవీటి రంగా ఉదంతాన్ని ప్రస్తావించడం అనేది కాపులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారన్న భావనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

చాలా సమయం తర్వాత తుని ఘటనపై వివరణ ఇచ్చుకున్న వైయస్ జగన్, ఏపీ సిఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే రాజకీయ విమర్శలలో ఇవన్నీ సర్వసాధారణమే కావడంతో ఈ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. ఈ ఘటన వెనుక జగన్ ఉన్నారన్న భావాలను వ్యక్తపరిచిన చంద్రబాబుపై వైయస్ జగన్ ఈ స్థాయి కౌంటర్ ఊహించిందే. అయితే, జగన్ విమర్శలు చంద్రబాబు వరకో, తెలుగుదేశం పార్టీ వరకో పరిమితమైతే పెద్దగా విమర్శలకు తావిచ్చేది కాదు. కానీ, కాపు వర్గానికి ప్రధాన నాయకుడైన వంగవీటి రంగా హత్యోదంతాన్ని మరోసారి తెరపైకి తేవడం విమర్శలకు తావిస్తోంది.

“వంగవీటి మోహన రంగా హత్యకు ప్రధాన కారకులు స్పీకర్ కోడెల శివప్రసాద్ మరియు దేవినేని ఉమా మహేశ్వరరావులే కారణమని, దీనికి సంబంధించి హరిరామ జోగయ్య తన పుస్తకంలో ప్రస్తావించారని” చెప్తూ జగన్ చేసిన ప్రకటనలు కేవలం కాపు వర్గాలను భావోద్వేగాలకు గురి చేయడానికే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రంగా హత్యకు గురి కాబడిన సమయంలో విజయవాడలో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి పాకాయి. ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాలకు కాపు వర్గపు బలమైన నాయకుడు అంటే రంగా మాత్రమే కావడంతో, జగన్ ఆ ‘స్విచ్’ నొక్కి ఉంటారన్న వ్యాఖ్యలకు క్రమంగా బలం చేకూరుతోంది.

ఉద్వేగానికి గురైన వారు ఏదొక అసాంఘిక కార్యక్రమం చేపడితే, అది చివరికి ఆ కులంపై ప్రజల్లో ప్రతికూల ముద్ర వేసేలా చేస్తుంది. కనుక కాపులను ఏదో ఉద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావిస్తే, ఆరడుల గోతులో తనను తానూ పూడ్చుకున్నట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుజ్జగిస్తూనే గిల్లడం అంటే ఇదేనేమో మరి!

Nara Lokesh Bike rally for GHMC campaign today

Nara Lokesh Bike rally for GHMC campaign today, TDP Photo Gallery